Aug 17,2023 00:07

కలెక్టర్‌కు ఆహ్వానపత్రం అందజేస్తున్న ఎన్‌జిఒ అసోసియేషన్‌ నాయకులు

గుంటూరు: ఈనెల 21న విజయవాడలో ఏపీ ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని అసోసియేషన్‌ జిల్లా నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్‌ యం.వేణుగోపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రం అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి శ్యామ్‌సుందర్‌ శ్రీనివాస్‌, నగర అధ్యక్షులు ఎస్‌పిఎస్‌ సూరి, కిషోర్‌, అగ్రికల్చర్‌ ఎంప్లాయీస్‌ అసో సియేషన్‌ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.