ఎపిఎండిసి పరిరక్షణకు పోరాడుదాం - సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

ఓబులవారిపల్లి : ఎపిఎండిసి సంస్థను, తమ బతుకుల కోసం, భవిష్యత్తు తరాల కోసం, పరిరక్షణ కోసం, అవుట్ సోర్స్ ట్రైనింగ్ కార్మికుల రెగ్యులర్ కోసం పోరాడుదామని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.చంద్రశేఖర్, ఎ.రామానుజులు పిలుపునిచ్చారు, శుక్రవారం మధ్యాహ్నం మంగంపేట చెన్నకేశవ గుడి వద్ద జరిగిన యూనియన్ సమావేశం మరి శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, రామాంజులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం బ్యాలెన్స్ కార్మికులుకు అమలు చేస్తామని, కమిటీల పేరుతో ఏడాదిన్నర కాలంగా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సమస్థ కోసం మంగంపేట కార్మికులు కుటుంబాలు తమ ఇల్లు, భూములు త్యాగం చేశారని పేర్కొన్నారు. పునరావాస ఆక్టివ్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్, ట్రైనీ పేరుతో యాజమాన్యం తక్కువ వేతనాలు ఇచ్చి దోపిడీ చేస్తూ మోసం చేస్తుందని విమర్శించారు. తక్షణం కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్లో స్టాచ్యురి పోస్టులో కూడా చట్ట విరుద్ధంగా అవుట్ సోర్సింగ్, ట్రైనీ, కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేస్తున్నారని విమర్శించారు. రెగ్యులర్ కార్మికుల, పే స్కేలు, ఆస్కీ కమిటీ రిపోర్ట్ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు కూడా డిపిసి కమిటీ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఈ నెల 26వ తేదీలోగా ఎఎల్‌సి వద్ద, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెకు పోవలసి వస్తుందిని వారు హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి నారదాసు సుబ్బరాయుడు గత కార్యక్రమాల సమీక్ష ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో సంఘాన్ని బలపరచుకొని జెఎసి ద్వారా ఐక్య ఉద్యమాలు నడపాలని తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు, ఎపిఎండిసి, అవుట్ సోర్సింగ్, ట్రైనీ, పోరాట కమిటీ జెఎసి కన్వీనర్ ఆర్.వెంకటేష్, ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై మాట్లాడుతూ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ పోరాట కమిటీ, జెఎసి ఆధ్వర్యంలో తక్కువ సమయంలోనే పోరాటం ద్వారా అనేక సమస్యలు సాధించుకుందామని తెలిపారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, యాజమాన్యం కాలయాపన చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. రెగ్యులర్ కోసం, సమస్థ మనుగుడ కోసం, దశల వారి ఆందోళన చేపడతామని, ఉద్యోగులు కార్మికులు, సహకరించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను, సంస్థ ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కుప్పాల సుబ్రమణ్యం, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గుణపాటి వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.వెంకటేష్, వర్కింగ్ సెక్రెటరీ జి.వెంకయ్య బాబు, ఉపాధ్యక్షులు మావిళ్ళ రాధా, సహాయ కార్యదర్శి, ఎ.చంద్రయ్య, ఎం.వెంకటరమణ, సి.సుబ్రహ్మణ్యం, రహంతుల్లా, బాదుల్లా, కారుమంచి నారాయణ, మునీంద్ర, పాల్గొన్నారు.