ప్రజాశక్తి - నూజివీడు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూజివీడు నియోజకవర్గ మహాసభ కెఎస్.శంకర్రావు అధ్యక్షతన స్థానిక రాయల్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా మహమ్మద్ అలీ అబ్బాస్, నీలా వన వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కిషోర్, గరికపాటి నాగ వలి కుమార్, జాయింట్ సెక్రటరీగా సీమటా శ్రీను, రవికుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ముసునూరి సతీష్ కుమార్, శ్రీనివాస్, కోశాధికారిగా అబ్బదాసరి వసంతరావు, మరో ఆరుగురితో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి కెఎస్.శంకర్రావు, జిల్లా పరిశీలకుడు వాతాడ నవీన్‌రాజు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల విలేకరులు పాల్గొన్నారు.










