Oct 13,2023 23:09

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ ఈ నెల 22న రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా మహాసభ విజయవంతం అవ్వాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం మహాసభ ఆహ్వాన పత్రికను కన్నబాబు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుగా ఉండి తాను ఈ స్థాయికి వచ్చానని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరుపున నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గొల్లపల్లి రాజ్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్‌ రాజ్‌, రాష్ట్ర నాయకులు మున్నీ, అధికార్‌, జిల్లా నాయకులు లక్ష్మణ్‌, బాబి, త్రినాథ్‌, బిందాన సురేష్‌, దాసరి శ్రీనివాస్‌, గోపీ, నాయుడు తదితర ఆహ్వాన కమిటీ పాల్గొన్నారు.