Mar 06,2023 22:58

ఎపిడబ్ల్యుజెఎఫ్‌ డైరీని ఆవిష్కరిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-సీతమ్మధార : ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ 2023 రాష్ట్ర డైరీని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం ఆవిష్కరించారు. సీతమ్మధారలోని ఒక ప్రైవేటు భవన్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులు ఫెడరేషన్‌ విశాఖ యూనిట్‌ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ప్రపంచ పెట్టుబడులు సదస్సును విజయవంతం చేసిన జర్నలిస్టులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సభ్యులు సంక్షేమానికి ఫెడరేషన్‌ అందిస్తున్న సేవలను కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తమ యూనియన్‌ ముందు వరుసలో ఉందన్నారు. అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షులు పి.నారాయణ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కెకె.రాజు, రవిరెడ్డి, సతీష్‌ వర్మ, ఫెడరేషన్‌ విశాఖ కార్యదర్శి అనురాధ, బ్రాడ్‌ కాస్ట్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, రామకృష్ణ, డి.రవికుమార్‌, జి.శ్రీనివాసరావు, సీతారామమూర్తి, సాంబశివరావు పాల్గొన్నారు.