Oct 17,2023 21:03

ఎపిఆర్‌ఒ నారాయణరావును సత్కరిస్తున్న డిపిఆర్‌ఒ రమేష్‌, సిబ్బంది

ప్రజాశక్తి-విజయనగరం :  ఎపిఆర్‌ఒగా నారాయణరావు జిల్లాలో చేసిన సేవలు ప్రశంసనీయమని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్‌ అన్నారు. డివిజనల్‌ పిఆర్‌ఒగా ఉద్యోగోన్నతి పొంది, విశాఖపట్నం బదిలీ అయిన నారాయణ రావును జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఐపిఆర్‌ఒ రమేష్‌ మాట్లాడుతూ, నారాయణరావు జిల్లాలో చేసిన సేవలను కొనియాడారు. చిత్తశుద్ది, అంకితభావంతో విధులు నిర్వహించే నారాయణరావు బదిలీ కావడం జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరిన అతి తక్కువ కాలంలోనే డివిజనల్‌ పిఆర్‌ఓగా ప్రమోషన్‌ పొందిన నారాయణరావు, మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డిఇఇ ఎస్‌వి రమణ, డివిజనల్‌ పిఆర్‌ఒ ఎస్‌.జానకమ్మ, జెఆర్‌ఇ మల్లేశ్వర్రావు, పిఆర్‌ఒ మజ్జి వాసుదేవరావు, ఎఇ శ్రీలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రభుదాస్‌, టైపిస్టు వెంకటరావు, పబ్లిసిటీ అసిస్టెంట్‌ సత్యనారాయణ, ఫొటో గ్రాఫర్‌ మురళి, టెక్నీషియన్‌ మాధవ్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.