Jun 09,2023 23:55

కుమార్తెకు స్వీటును తినిపిస్తున్న తల్లిదండ్రులు

ప్రజాశక్తి-మాడుగుల:ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ (ఏపీఆర్‌ఎస్‌)కు మాడుగుల కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థిని దేవరపల్లి ఉనైస ఎంపిక అయ్యింది. గత నెల 20న ప్రవేశ పరీక్షలు జరగగా శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ బాలిక భీమిలి ఏపిఆర్‌ఎస్‌కు ఎంపిక అయ్యింది. సిబిఎస్బి సిలబస్‌తో ఉన్నతమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యాలు అందుబాటులో వుంటాయి. బాలిక తల్లిదండ్రులు దేవరపల్లి రామకృష్ణ, రూప వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు తాళపు రెడ్డి నాగచంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.