Oct 06,2023 00:51

ఏపి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు:

ఏపి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు:
డిఇవో
ప్రజాశక్తి -పలమనేరు: విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, దీనిని మనం చిత్తసుద్ధితో అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చిత్తూరు జల్లా విద్యాశాఖాధికారి విజయేంద్ర రావు ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు. గురువారం స్ధానిక బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వైఎస్‌ఆర్‌ టీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఇంకనూ మాట్లాడుతూరాష్ట్రంలో జరుగుతున్న నాడు బి నేడు పనులు పాఠశాలలలో కలిపిస్తున్న మౌలిక వసతులు దేశానికే ఆదర్శ మన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా గౌరవ సలహాదారు సోమచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్స రాల చరిత్రలో విద్యారంగంలో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు లు రాలేదన్నారు. ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి వైఎస్‌ఆర్‌ టీఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యువరాజురెడ్డి, జయకాంత్‌, జిల్లా పరిషత్‌ సాంఘీక సంక్షేమ సలహా మండలి చైర్మన్‌ అమరనాథ్‌, పలమనేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హేమంత్‌ కుమార్‌ రెడ్డి, పలమనేరు నియోజక వర్గ పరిధిలోని మండల విద్యాశాధికారులు ప్రసం గించారు. అనంతరం విద్యాశాఖాధికారి, పలువు రు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్‌ఆర్‌ టీఎఫ్‌ ఉపాధ్యక్షులు పుష్పావతి, కోశాధికారి ఏ.ఆర్‌. కుమార్‌, పలమనేరు డివిజన్‌ అధ్యక్షప్రధాన కార్యదర్శులు పట్టాభి రామయ్య, రోషన్‌ ఆలీఖాన్‌, కోశాధికారి రమేష్‌, ఉపాధ్యక్షులు గిరిధర మూర్తి,వడయార్లతో పాటు దాదాపు 300మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.