May 20,2023 22:43

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ శేషారెడ్డి


ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన పోలిసెట్‌ ఫలితాల్లో ఆదిత్య స్కూల్‌ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. సుమారు 15 మంది విద్యార్థులు ప్రథమ స్థానాల్లో ముందు నిలిచారు. ఆదిత్య పాఠశాలకు చెందిన విద్యార్థి గోనెల్ల శ్రీరామ శశాంక్‌ 120 మార్కులకు గాను 120 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంక్‌ను సాధించారు దీనికి సంబంధించిన వివరాలను ఆదిత్య కళాశాలలో సంస్థ చైర్మన్‌ ఎన్‌ శేషారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ గత కాలం నుండి ఇప్పటివరకు పాలిసెట్లో ఏడు సార్లు ప్రధమ ర్యాంకు రాష్ట్రస్థాయిలో సాధించడం ఆదిత్య విద్య సంస్థలకే గర్వకారణమన్నారు. ఇంకా తమ విద్యార్థులు పాలిసెట్లో ఎర్ర లక్ష్మీ కీర్తనకు 119, అందే శివ కార్తీక్నకు 119, కంచర్ల సాయి శ్రీహిత్‌ కు 119, కొవ్వూరు ప్రసన్నకుమార్‌ కు 119, గొల్లపల్లి లోషినికి 119 కాకి అనన్యకు 119, తంగెళ్ల సాత్విక్‌ కు 119 మార్కులు సాధించి వరుసగా 16, 25, 37 ర్యాంకులను సాధించారన్నారు. అలాగే ఇంకా తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 118, 117, మార్కులను సాధించి ఆదిత్యకు తిరిగిలేని ఆదరణ ఉందని నిరూపించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బందాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్‌కె. దీపక్‌ రెడ్డి, డైరెక్టర్‌ శృతిరెడ్డి, శ్రీనగర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ టి రమేష్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.