Jan 11,2023 23:43

ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి- కె.కోటపాడు
ఎపి పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం కె.కోటపాడు యూనిట్‌ కార్యవర్గం ఎన్నికలు మండల కేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా జరిగాయి. కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పనిచేస్తున్న మండల పరిషత్‌, పిఆర్‌ ఇంజినీరింగ్‌, జెడ్‌పి ఉన్నతపాఠశాలల్లో పని చేస్తున్న మినిస్టీరియల్‌ ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఒక్కో నామినేషన్‌ మాత్రమే రావడంతో యూనిట్‌ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు జిఎల్‌.నర్సింగరావు ప్రకటించారు. యూనిట్‌ అధ్యక్షులుగా డి.మంజువాణి, (మండల పరిషత్తు పరిపాలన అధికారి, కె.కోటపాడు), ఉపాధ్యక్షులుగా జివి.రమణ, మండల పరిషత్తు ఎఒ, దేవరాపల్లి), సంయుక్త కార్యదర్శిగా బివిజిఆర్‌. కుమార్‌ (మండల పరిషత్తు ఆఫీసు టైపిస్టు కె.కోటపాడు), కోశాధికారిగా జెవి.చాందిని (జూనియర్‌ అసిస్టెంట్‌, జెడ్‌పి హైస్కూల్‌ కె.కోటపాడు), జిల్లా కౌన్సిల్‌ సభ్యులు-1గా సిహెచ్‌.ఈశ్వరరావు (జూనియర్‌ అసిస్టెంట్‌ జెడ్‌పి హైస్కూల్‌ ఎం.అలమండ, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు-2గా ఎన్‌.సాంబశివరావు (మండల పరిషత్తు కార్యాలయ టైపిస్టు దేవరాపల్లి) ఎన్నికయ్యారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సంఘం జిలా అధ్యక్షులు ఎస్‌.సత్తిబాబు అభినందనలు తెలిపారు.