Jan 24,2023 00:00

బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీధర్‌

ప్రజాశక్తి -మోతుగూడెం
ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా బొడ్డు శ్రీధర్‌ సోమవారం చింతూరు మండలం మోతుగూడెంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ ఇంతకు ముందు ఏపీ జెన్కో విద్యుత్‌ సౌదంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఏడీఎంగా విధులు నిర్వహించారు. ఇక్కడ చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేసిన రాంబాబు గతేడాది జూన్‌ 30న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జులై 1 నుంచి ఇప్పటివరకు ఓ అండ్‌ డ్యామ్‌ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సోమవారం ఆయన స్థానంలో చీఫ్‌ ఇంజినీర్‌గా బొడ్డు శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌కు ఎస్‌ఇ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఎస్‌ఈ (ఓ అండ్‌ డ్యాం) వెంకటేశ్వరరావు, ఈఈలు బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, సివిల్‌ విభాగానికి చెందిన ఇఇలు జాకీర్‌ హుస్సేన్‌, బాబురావు ఏఎస్‌ నాగేశ్వరరావు, సీనియర్‌ అకౌంటు ఆఫీసర్‌ వి.ప్రసాద్‌, జెన్కో ఇంజనీర్లు, కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.
ఐటిడిఎ ఎపిఒకు సుజాత బాధ్యతలు స్వీకరణ
చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని ఐటీడీఏ ఏపీవోగా కంచర్ల సుజాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈమె ఏటిడబ్ల్యుఒగా చింతూరు డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు.