ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఎపి ఎన్‌జిఒల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎపి ఎన్‌జిఒ భవనంలో బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శ్రీనివాస్ ప్యానల్ జిల్లా ఉద్యోగుల సమక్షంలో ఎన్నికైంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ముందుండి యూనియన్ తరపున పోరాటాలు సాగిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.










