Sep 06,2023 20:54

పుష్పగుచ్చం అందేస్తున్న దృశ్యం


పుష్పగుచ్చం అందేస్తున్న దృశ్యం
ఎపి డిఎంఇకు సన్మానం
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పర్యటనకు విచ్చేసిన ఏపి రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నరసింహను ఎపి ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రభుత్వ వైద్యులు , సిబ్బంది , రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్ర, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జమున, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌ కళారాణి, ప్రొఫెసర్‌, అసోసియేట్‌ , అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్‌ ఐ వి రామచందర్రావు, డాక్టర్‌ మస్తాన్‌ భాష, డాక్టర్‌ గంగాధర్‌, డాక్టర్‌ రాజ్యలక్ష్మి ,డాక్టర్‌ నాగ మునయ్య, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ మాధవి,డాక్టర్‌ జయ చంద్ర, డాక్టర్‌ రోజా రమణి, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ శాంతి శ్రీ ,డాక్టర్‌ లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ భవాని, డాక్టర్‌ సత్య వర్ధన, డాక్టర్‌ రాయుడు, డాక్టర్‌ రమణమూర్తి డాక్టర్‌ కష్ణమూర్తి, డాక్టర్‌ వీరనారాయణ, డాక్టర్‌ రాజమ్మ, డాక్టర్‌ గిడియన్‌, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ సుశీల్‌ తదితరులు పాల్గొన్నారు.