Dec 09,2022 23:40

అడుగడుగునా పహారా కాస్తున్న పోలీసులు

విస్తృతంగా పోలీసు కూంబింగ్‌
ప్రజాశక్తి -సీలేరు

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులు జరిగిన మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు ఏఓబిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఏఓబి సరిహద్దు తాడికోల అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్‌ చేస్తుండగా పోలీసు రాకను గమనించిన మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు చనిపోవడంతో ప్రతికార దాడులకు తప్పవని మావోయిస్టులు హెచ్చరించినట్లు పోలీస్‌ ఇంటలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పోలీసు బలగాల అప్రమత్తమై అదనపు బలగాలని మొహరించి మావోయిస్టుల అచూకీ కోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు. మావోయిస్టు ఇన్‌ఫార్మర్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు నిరంతరం పహారా కాస్తున్నారు. దీంతో ఏఓబి ఉన్న గిరిజనులు ఏ క్షణంలో ఏమీ జరుగుతుందోనని భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.