Oct 26,2023 21:02

కూనేరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న ఎస్‌ఇబి డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి

ప్రజాశక్తి-కొమరాడ,పాచిపెంట : ఎఒబి సరిహద్దు ప్రాంతాల్లో నిరంత తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్‌ఇబి డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీదేవి తెలిపారు. గురువారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కూనేరు, పి.కోనవలస చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలను నిరంతరం తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గంజాయి, అక్రమ మద్యం, సారా లాంటి నిషేధిత పదార్థాలను ఆంధ్ర ప్రాంతానికి రాకుండా నిరోధించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర పాల్గొన్నారు.