Oct 14,2022 23:47

గిరిజనులతో మాట్లాడుతున్న జర్మనీ దేశస్తులు

ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పలు గ్రామాల్లో జర్మనీకి చెందిన హాన్స్‌ పీటర్‌ బృందం శుక్రవారం పర్యటించింది. ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కెందుగూడ, గుమ్మ, గిరిజన గ్రామాలను జర్మనీ దేశస్తులు సందర్శించారు. వారికి గిరిజనులు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనులతో వారు సమావేశమై గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకుని మంత్రముగ్ధులయ్యారు. చింతూరు మండలంలోని వరదలలో నిరాశ్రయులైన బాధితులను పరామర్శించారు. వరదల వల్ల కలిగిన కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హాన్స్‌ పీటర్‌ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చింతూరు మండలంలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు బాధితులకు ఆర్థికంగా తమ సహకారాన్ని అందించామని తెలిపారు. ప్రస్తుతం వరదలలో నష్టపోయిన బాధితులకు మనోధైర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. గిరిజనుల ఆచార సాంప్రదాయాలు తమను ఆకర్షించినట్లు చెప్పారు. ఈ ప్రదేశాల్లో సుందర దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ కార్యక్రమంలో యుసిఐఎం సమస్త అధ్యక్షుడు బిస్సఫా, డాక్టర్‌ కెఆర్‌ సింగ్‌, చర్చి పాస్టర్‌ మనసై డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.