
ట్రెండ్ బ్రిడ్జ్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రోరీ (0) పెవిలయన్ బాట పట్టాడు. వరుసగా నాలుగు బంతులు పరుగులేమీ ఇవ్వని బుమ్రా ఐదో బంతికి వికెట్ తీశాడు. ఎల్‌బిడబ్ల్యూగా రోరీ మైదానం వీడాడు. చివరి బంతికి కూడా పరుగులేమీ రాకపోవడంతో బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో ఒక వికెట్‌తో మెయిడిన్‌గా ముగిసింది. ఇక, మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ కూడా మెయిడిన్‌గా ముగిసింది.