Jul 27,2021 10:49

ఢిల్లీ : దేశంలో గత మూడేళ్లలో 5,62,886 ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో అత్యధిక సీట్లు ప్రైవేటు కాలేజీల్లోనే తగ్గాయి. సోమవారం లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ... ఇంజినీరింగ్‌ సీట్ల తగ్గుదలపై వివరణ ఇచ్చారు. కొన్ని కోర్సులకు డిమాండ్‌ తగ్గిపోవడం, మున్ముందు విద్యార్థులు వాటిల్లో చేరుతారన్న నమ్మకం లేకపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈమేరకు సీట్లు తగ్గించుకున్నట్లు తెలిపారు. ఎక్కువగా ప్రైవేటు కాలేజీల్లో సీట్లు తగ్గాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్యను దఅష్టిలో ఉంచుకొని 2022 సంవత్సరం వరకు కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఎఐసిటిఈ అనుమతులు ఇవ్వబోదని మంత్రి స్పష్టం చేశారు. ఆకాంక్షిత జిల్లాల్లో ఏర్పాటు చేసే కాలేజీలకు, అత్యధిక ఉద్యోగావకాశాలున్న వఅత్తి విద్యా కోర్సుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇంజినీరింగ్‌, డిప్లొమా కోర్సులను ప్రారంభించడానికి ముందుకొస్తే వాటికే అనుమతిస్తున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.