Nov 01,2022 23:42

ఎన్‌టిపిసిలో నిర్వహిస్తున్న సమైక్యతా ర్యాలీ

ప్రజాశక్తి - పరవాడ: సింహాద్రి ఎన్‌టిపిసిలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంస్థ హెచ్‌ఒపి జిసి చౌకెస్‌ పాల్గొని, పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశపు ఉక్కుమనిషిని సర్దార్‌ వల్లభారు పటేల్‌ దేశానికి చేసిన సేవలను, కృషిని కొనియాడారు. సిబ్బందితో సమైక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం ఎస్‌హెచ్‌. బి రామారావు,. సిజిఎం యుఎఫ్‌ ఎస్‌సిఎస్‌ బంద్‌ రాజన్‌, జిఎంలు, హెచ్‌ఒడిలు,, అసోసియేషన్‌, సంక్షేమ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.