
ప్రజాశక్తి - పరవాడ
ఎన్టిపిసి సింహాద్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మిషన్ లైఫ్‌తో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. సింహాద్రి జిజిఎమ్ సంజరు కుమార్ సిన్హా ప్రతిజ్ఞ చేయించారు. జిఎమ్ డిపి పాత్ర సందేశాన్ని చదివి వినిపించారు. హరితహారంపై అవగాహన పాదయాత్ర నిర్వహించారు. జిఎమ్‌లు, దీపాంజలి నగర్ వాసులు, జిఇఎమ్ పిల్లలు, సిఐఎస్‌ఎఫ్, ఇతర సహచరులు హరిత నడక, సామూహిక చెట్ల పెంపకంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జియో పాలిమర్ కాంక్రీట్ (జిపిసి) నిర్మించిన యాష్ ట్రక్ పార్కింగ్ యార్డ్‌ను జిజిఎం సింహాద్రి సంజరు కుమార్ సిన్హాతో పాటు సిజిఎం(యుఎస్‌ఎస్‌సి), గోవింద్ రాజన్ ఇతర సీనియర్ అధికారులు ప్రారంభించారు.
వి సెజ్‌లో..
ఎంవిపి.కాలనీ : విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వి సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పల పర్యావరణ పరిరక్షణ కాంక్షిస్తూ మొక్కలు నాటారు. అన్ని విభాగాల్లో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెజ్‌లోని పలు విభాగాల అధిపతులు, యూనిట్ల ప్రతినిధులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యాన వాక్‌థాన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌పిసిఎల్ ఆధ్వర్యాన ఆర్‌కె బీచ్‌లో వాక్‌థాన్ నిర్వహించారు. మొక్కలు పంపిణీ చేశారు. బీచ్ క్లీనింగ్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌పిసిఎల్ విఆర్‌ఎంపి ఇడి పి.వీరభద్రరావు మాట్లాడారు. మెరుగైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో సంస్థ అధికారులు సి.మురళీకృష్ణ, ఎస్‌కె.ఝా, బివివి.రాజు, పి.బాలకృష్ణన్, డిజిఎం, ఎ.సుందరవదన్, సంస్థ ఉద్యోగులు, హెచ్‌పి గ్యాస్ పంపిణీదారులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.