
ప్రజాశక్తి-పరవాడ
ఎన్టీపీసీ సింహాద్రిని ఆ సంస్థ డైరెక్టర్ రమేష్ బాబు, ఆర్‌ఈడి దేబాశిష్ చటోపాధ్యాయ, ఈడి సి.శివకుమార్ శుక్రవారం సందర్శించారు. సింహాద్రి ప్లాంట్‌లోని స్టేజ్ -2 యాష్ వంటి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. సైలో, స్టేజ్-1 ఎన్డీసిటి ప్రాంతాలు, స్టేజ్ -1 ఐడిసిటి యూనిట్-4, యుసిబి, ఇఎస్పి ప్రాంతాలు, సంకల్ప్ -2, ఎఫ్‌జిడి సైట్‌లో పనులను సమీక్షించారు. అనంతరం సింహాద్రి స్టేషన్ పనితీరు, ఇతర సమస్యలపై అధికారులతో సమీక్షించారు. తుప్పు నియంత్రణ, రక్షణపై వర్క్‌షాప్‌లో పాల్గొని వివిధ ప్రెజెంటేషన్‌ల సంకలనాన్ని విడుదల చేశారు. బాలిక సాధికారత మిషన్, సిఎస్‌ఆర్ ఫ్లాగ్‌షిప్‌ను రమేష్ బాబు, సంయుక్త మహిళా సమితి సీనియర్ సభ్యురాలు వాణి రమేష్ బాబు ప్రారంభించారు. యూనిఫారాలు, స్టేషనరీ, టాయిలెట్, ట్రాక్ సూట్లు, టీ-షర్టులు, పాదరక్షలు కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి బియుహెచ్ సంజరు కుమార్ సిన్హా, సీనియర్ అధికారులు, జిఇఎమ్ పిల్లల తల్లిదండ్రులు, దీపికా లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.