Oct 15,2023 00:11

ప్రజాశక్తి - పంగులూరు
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మండలంలోని జాగర్లమూడి వారి పాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట శనివారం రాత్రి టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు యువత నాయకులు జాగర్లమూడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయని అన్నారు. జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపుగా, పథకం ప్రకారం టిడిపిని, చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలంతా కదలి పని చేయాలని కోరారు. ప్రభుత్వం చేసే అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు ధూళిపాళ్ల సుబ్బారావు, జాగర్లమూడి కోటేశ్వరరావు, ఉప్పుటూరు హనుమంతరావు, గడ్డం తులసమ్మ, గొట్టిపాటి భాస్కరరావు, కేసిన మల్లయ్య, గొట్టిపాటి అనంతలక్ష్మి, వీరమాస కోటేశ్వరమ్మ, జరుగుల శ్రీను, చెరుకూరి సుబ్బారావు, దూళిపాళ్ల సోమయ్య, జాగర్లమూడి భూలక్ష్మి, ధూళిపాళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.