టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రులకు అన్న ఎన్‌టిఆర్ 27వ వర్థంతిని తెలుగు తమ్ముళ్లతోపాటు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన ఎన్‌టిఆర్ సేవలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరాలతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. (ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం)
భీమునిపట్నం: స్థానిక టిడిపి కార్యాలయం వద్ద భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ సౌజన్యంతో రక్తదానశిబిరం నిర్వహించారు. ముందుగా చినబజారు జంక్షన్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మూడవ వార్డు కార్పొరేటర్‌గంటా అప్పలకొండ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు, తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షులు బోయి రమాదేవి, పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్ రాజు, ఎస్‌సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు పతివాడ రాంబాబు, వార్డుల అధ్యక్షులు టి సూరిబాబు, బడిగింటి నీలకంఠం, పాసి నరసింగరావు, గరే సదానంద పాల్గొన్నారు.
తగరపువలసలో.. స్థానిక రాజవీధి, హైవే కూడలి వద్ద ఎన్‌టిఆర్ విగ్ర హాలకు పార్టీ నాయకులు టి సూరిబాబు, బడుగింటి నీలకంఠం, గిడుతూరి శ్రీను, చిలకా నరసింగరావు, ఎంవి గురుమూర్తి, జె గణేష్‌రెడ్డి నివాళులర్పించారు.
భీమిలి గ్రామీణ మండలంలో... టి నగరపాలెం, లక్ష్మీపురం, కృష్ణంరాజుపేట, అమనాం గ్రామాల్లో ఎన్‌టిఆర్‌కు తెలుగుతమ్ముళ్లు ఘననివాళులర్పించారు.
మధురవాడ: ఏడో వార్డు మార్కెట్ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్డు అధ్యక్షులు పిళ్లా నరసింగరావు సీనియర్ నేత పిళ్లా వెంకటరావు, నాగోతి సూర్యప్రకాష్, కానూరి అచ్యుతరావు, పోతిన సోముపాత్రుడు, నాగేశ్వరరావు, కిషోర్, బండయ్య పాల్గొన్నారు.
పెందుర్తి, వేపగుంటలో...
పెందుర్తి : పెందుర్తి కూడలిలో ఎన్‌టిఆర్ విగ్రహానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేపగుంటలో ఎన్‌టిఆర్ చిత్రపటానికి 94వ వార్డు టిడిపి కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన పేదల పెన్నిది,ó యుగ పురుషుడు ఎన్‌టిఆర్ ఆశయసాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు వార్డు అధ్యక్షుడు గంట్ల దివాకర్, మామిడి కిరణ్, సూరిబాబు పాల్గొన్నారు
పిఎం పాలెం: ఆరో వార్డు పిఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విగ్రహ దాత, టిడిపి బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనంద్‌బాబు, కెవిఆర్ క్యాటరింగ్ అధినేత, జిల్లా తెలుగు యువత కార్యదర్శి గరే గురునాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ నివాళులర్పించారు.
ఐదవ వార్డు పరదేశిపాలెంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు, బోయి శ్రీను ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు భీమిలి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు బోయి రమాదేవి, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీనివాస్, వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, తెలుగు యువత అధ్యక్షులు కొండపు రాజు పాల్గొన్నారు.
మాధవధార: 50వ వార్డు టిడిపి అధ్యక్షులు, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో మురళీనగర్ పార్టీ కార్యాలయం నుంచి బిర్లా జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు టిడిపి అధ్యక్షులు పోలమరశెట్టి శ్రీను, మూల అప్పారావు, సనపల రామచంద్రరావు, కనమటి రమణ, పేడాడ మధు, ఎన్‌టిఎస్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు బొందల మదన్‌మోహన్, మహిళ అధ్యక్షులు పైడి పుణ్యవతి, ప్రమీల రాణి, దవల కుమారి, అజరు, నాగన్న, సనపల విజరుకుమార్, కంచరాణ వరదరాజు, ంబాళ్ల సత్యనారాయణ, ఓంబాబు, సనపల గోవిందరాజు, సనపల సత్యనారాయణ, మూల రాము, సత్యవతి, పరమేష్, నంబాళ్ల కనకరాజు, నిరంజన్, ఉపేంద్ర, సాయి కుమార్, మహేష్, సంతోష్ పాల్గొన్నారు.
పద్మనాభం : పాండ్రింగిలో మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డిపి అప్పల నరసింహరాజు, పద్మనాభంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడుకోరాడ రమణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ సేవలను కొనియాడారు. తెలుగుమహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, మాజీ జెడ్‌పిటిసి కశిరెడ్డి దామోదరరావు, ఎంపిటిసి కంటుబోతు లక్ష్మి.శ్రీను, అప్పలనాయుడు, వెంకటరావు పాల్గొన్నారు.
ఆరిలోవ : 9వ వార్డు జోడుగుళ్ళపాలెంలో వార్డు పార్టీ ఇన్‌ఛార్జి బుడుమూరు గోవిందు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్డు అధ్యక్షుడు అక్కరమాని రాంబాబు, బాదరు బాలరాజు, నల్ల ఈశ్వరరావు, శ్రీను, వెంకటరావు పాల్గొన్నారు.
10వ వార్డులో... కార్పొరేటర్ మద్దిల రామలకీëరాజశేఖర్ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ , బిఎన్‌ఆర్ నగర్‌లలో ఎన్‌టిఆర్ విగ్రహాలకు వార్డు అధ్యక్షులు గాడు అప్పలనాయుడు, కె. సత్యనారాయణ, లకీë, తులసి పార్వతి, వెంకటరావు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
11, 12 వార్డుల్లో... ఆరిలోవ దుర్గాలమ్మ గుడి వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికపార్టీ నేతలు గాడి సత్యం, మూది అప్పారావు, దువ్వి తాతారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ములగాడ : పారిశ్రామిక ప్రాంత టిడిపి నేతల ఆధ్వర్యంలో మల్కాపురం, రామకృష్ణాపురం, హెచ్‌పిసిఎల్ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహాలకు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. టిడిపి నేతలు మజ్జి. సోమేశ్, నక్క. లక్ష్మణరావు నీలాపు జోజి, కాకి పోలిరెడ్డి, చింతలపూడి సత్తిబాబు, మజ్జి మాలి నాయుడు డోప్పు సన్యాసిరావు, పాల్గొన్నారు.
సింహాచలం: 98వ వార్డు సింహాచలం మార్కెట్ ఏరియాలో వార్డు కార్పొరేటర్ పివి.నరసింహం ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ వర్థంతి నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టిడిపి కార్యదర్శి పాసర్ల ప్రసాద్, కార్పొరేటర్ నరసింహులు మాట్లాడుతూ ఎన్‌టిఆర్ సేవలను కొనియాడారు. పేదలకు ప్రసాద వితరణ చేపట్టారు. తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకరరావు, వార్డు అధ్యక్షులు పంచదార శ్రీనివాసరావు, మేకల కాసుగోపాల,్ గుసిడి అవినాష్, గుసిడి శంకరరావు, పట్నాల ధర్మారావు రౌతు రాంబాబు, బిసి రమణ పాల్గొన్నారు.










