Oct 28,2022 22:50

కోలాటబృందానికి చీరలు పంపిణీ చేస్తున్న లక్ష్మణరావు

ప్రజాశక్తి- ములగాడ : తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని పార్టీ పిలుపుమేరకు ప్రతినెలా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆర్‌కె.పురం పెట్రోల్‌ బంకు దరి ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నిరుపేదలకు బియ్యం, కిరాణా సామగ్రి అందజేశారు. అలాగే 59వ వార్డులోని వేంకటేశ్వరస్వామి కోలాట బృందానికి, అలాగే బంగారమ్మ అమృతవర్షిణి కోటాట బృందం సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టిఎన్‌టియుసి నేతలు కె.అది, మజ్జి సోమేష్‌, తెలుగు యువత నాయకులు రామ్మోహన్‌నాయుడు, సినిమాల.సత్తి, పొక్కల కృష్ణ, ఎకెసి సురేష్‌, జయశంకర్‌, భీమ, ఊరుకుటి.మహేష్‌, 59వ వార్డు ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి శంకర్‌, ఉపాధ్యక్షులు డొంకాన రాంబాబు, తెలుగు యువత నేత ఊరుకుటి హరి, తోనింగి రాజ్‌కుమార్‌, సేనాపతి సత్తిబాబు, ఎం లక్ష్మణరావు, పెద్దాడ పైడిరాజు, ఎం వెంకటేశ్వరరావు, మడక రమణ, బండారు వెంకటరావు, డొప్ప గోవింద, నక్క రమణమూర్తి, మహిళా నాయకురాలు సర్వశుద్ధి కుంచమ్మ పొట్నురి లక్ష్మీ, నెల్లి కనక, హిందూస్తాన్‌ షిప్‌యార్డ్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రంజాన్‌ ప్రసాద్‌, విశాఖ జిల్లా కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.తారక్‌, కోశాధికారి చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు.