క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న అభిమానులు
ప్రజాశక్తి - కాకినాడరూరల్
రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఎన్‌టిఆర్ శత జయంతిని పురస్కరించుకుని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ అభిమాని తురగా సూర్యారావు మాట్లాడుతూ ఎన్‌టిఆర్ గొప్ప నటుడే గాక ప్రజా నాయకుడని, తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానేత అని అన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అడబాల రత్న ప్రసాద్, మాణిక్ రెడ్డి సత్య నారా యణ, శిరీష, రేలంగి బాపిరాజు, అడబాల సత్యనారాయణ, సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.










