ప్రజాశక్తి అద్దంకి: పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఆ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని తిమ్మాయపాలెం, జార్లపాలెం, నాగులపాడు తదితర గ్రామాలలో పార్టీ అభిమానులు జెండాను ఆవిష్కరించారు. పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కాకానిపాలెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నందమూరి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత ఊహించారు. డాక్టర్ సింగ్ విజయ రామారావు, డాక్టర్ ఫణీంద్రబాబు, మహిళల చేత జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన యుగ పురుషుడు అని అన్నారు. డాక్టర్ సింగ్ విజయ రాఘవరావు మాట్లాడుతూ అన్న బాల్యం నుండే కష్టంతో పైకి వచ్చిన శ్రమజీవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు సందరెడ్డి శ్రీనివాసరావు, కాకాని అశోక్, మాజీ జడ్పిటిసి సభ్యురాలు సింగ్ సుబ్బాయమ్మ, మాజీ పంచాయతీ ప్రెసిడెంట్ పొడపాటి మోహన్‌రావు, కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ, కంప రజిని, అడ్వకేట్ చదలవాడ గృహలక్ష్మి అడ్వకేట్ కాకాని అమృతలక్ష్మి, కాకాని లక్ష్మీ నాగేశ్వరమ్మ, మోత్కూరు సుభాష్‌బాబు, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, గోవాడ శ్రీకాంత్, శ్రీనివాసరావు, కుందారపు రామారావు, అత్తులూరు రమేష్‌బాబు, కాకాని శ్రీనివాస రావు, నర్రా సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు కేక్ కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిపి రామారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. ఆయన క్రమశిక్షణ టిడిపి శ్రేణులకు స్ఫూర్తి కావాలన్నారు. సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు చిరస్మ రణీయం అన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మేకా పూర్ణచంద్రరావు, తాడిపర్తి మల్లిఖార్జునరావు, షేక్ బాషా, షేక్ మొహిద్దీన్, షేక్ కరీముల్లా, కండవీటి అగస్త్య, చెన్ను నాగమల్లేశ్వరరావు, దాసరి అమరనాథ్, దున్నా జయప్రద, మోర్ల అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
పంగులూరు: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు ఆదివారం మండలంలోని జాగర్లమూడివారి పాలెం గ్రామంలో ఘనంగా జరిగాయి. ధూళిపాళ్ల వీరనారాయణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు జాగర్లమూడి పూర్ణచంద్రరావు, జాగర్లమూడి హరికృష్ణ, గొట్టిపాటి భాస్కరరావు, కూనం కిశోర్, ధూళిపాళ్ల సుబ్బారావు, జాగర్లమూడి నందనరావు, జాగర్లమూడి మోహనరావు, కోటేశ్వరరావు, ప్రసాదరావు, కృష్ణమూర్తి, ఎన్టీఆర్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను విశేషంగా జరుపుకున్నారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు గ్రామస్తులం దరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అలవలపాడులో..
నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం సాయంత్రం పంగులూరు మండలంలోని అలవలపాడు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోమటి ప్రసాద్, గొట్టిపాటి కోటేశ్వరరావు, ఇంటూరి శ్రీనివాసరావు, గొట్టిపాటి కొండలు, ఎర్రమనేని శివాజీ, బాచిన అంజయ్య తదితరులు నాయకత్వం వహించారు.
భట్టిప్రోలు: టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రం భట్టిప్రోలులో మార్కెట్ యార్డ్ వద్ద గల ఆయన విగ్రహానికి గ్రామ టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఐలవరం, వెల్లటూరు, పల్లెకొన, పెదపులివర్రు గ్రామాలలో ఆయా గ్రామ పార్టీ నాయకులు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరాజుద్దీన్, జయశీలరావు, లెనిన్, మాచర్ల నాగరాజు, దీపాల శివ ప్రసాద్, అనగాని ఏడుకొండలు, పి శంకరరావు, రాయన ప్రసాద్, వేజెళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పర్చూరు: పర్చూరులో ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బొమ్మల సెంటర్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ చేసిన సేవలను కొనియాడారు. భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు షేక్ షంషుద్దీన్, ఏవి కృష్ణ, మక్కెన శేఖర్‌బాబు, కోడూరి శేషబ్రహ్మాచారి, మానం హరిబాబు, తులసి శ్రీనివాసరావు, కొరిటాల సురేష్, రామారావు, వెంకటసుబ్బారావు, సమీర్, ఖాజావలి, బషీర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.










