ప్రజాశక్తి - టి.నర్సాపురం
మండల కేంద్రమైన టి.నర్సాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మండం ఆదిత్య కుమార్ ఇటీవల ప్రభుత్వం ముద్రించిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టిఆర్ రూ.100 నాణేన్ని కొనుగోలు చేసినట్లు మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా భీమవరంలో మాజీ ఎంపీ మాగంటి బాబు చేతులమీదుగా ఆ నాణేన్ని అవిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్, టి.నర్సాపురం మాజీ మండలపార్టీ అధ్యక్షులు పిన్నమనేని మధు, బిసి సెల్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, అక్కిన శేషు పాల్గొన్నారు.










