Sep 28,2022 23:08

రిలే నిరాహారదీక్షలో కోరాడ తదితరులు

ప్రజాశక్తి- భీమునిపట్నం : విజయవాడలోని వైద్యవిశ్వవిద్యాలయానికి ఎన్‌టిఆర్‌ పేరును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో స్థానిక చిన్న బజారు జంక్షన్‌లో బుధవారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు అప్పారావు, మండల అధ్యక్షులు డిఎఎన్‌ రాజు, 1,2,3,4 వార్డులకు చెందిన టిడిపి అధ్యక్షులు టి సూరిబాబు, బడిగింటి నీలకంఠం, గంటా నూకరాజు, పాసి నరసింగరావు, కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, పివి నరసింహం, నాయకులు మొల్లి లక్ష్మణరావు, గాడు అప్పలనాయుడు, బిసి సాధికారత టిడిపి రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్‌ వానపల్లి సత్య, మాజీ జెడ్‌పిటిసి సభ్యులు సరగడం అప్పారావు, కె దామోదరరావు, ఎస్‌.జోగారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్‌టిఆర్‌ పేరును కొనసాగించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. టిడిపి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.