Sep 22,2022 23:39

సాగర్‌నగర్‌లో నిరసన తెలుపుతున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి - యంత్రాంగం
ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి ఆధ్వర్యాన గురువారం పలుచోట్ల నిరసనలు తెలిపారు.
కలెక్టరేట్‌ : టిడిపి కార్యాలయం ఆవరణలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షులు సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడారు. రానున్న కాలంలో ప్రజలు ప్రభుత్వాన్నే మార్చనున్నారన్నారు. ఎన్‌టిఆర్‌ పేరును మారిస్తే ఆయన భార్యనని చెప్పుకుంటున్న నందమూరి లక్ష్మీపార్వతి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దత్తపుత్రుడు జగన్‌ కోసమే ఆమె దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, పల్లా ఉమారాణి, బొడ్డేపల్లి లలిత, సౌజన్య, శ్రీదేవి, లక్ష్మి లావణ్య, రమాదేవి, ఆశ్లేష, చందక లలిత పాల్గొన్నారు.
మధురవాడ : 8వ వార్డు పరిధి సాగర్‌నగర్‌లో వార్డు టిడిపి అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, పేరు మార్పు తీర్మానానికి జగన్మోహన్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బోడేపూడి దొరబాబు, శతపతి మంగాదేవి, సారిపల్లి వెంకట్రావు, ఎ.రాంబాబు, ఒమ్మి బాబూరావు, దువ్వి పరమేశ్వరరావు, తణుకు పష్పలత, బోనుల కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కంచరపాలెం : ఉత్తర నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి చిక్కాల విజరు బాబు, అధ్యక్షులు కార్తీక్‌ కుట్టా ఆధ్వర్యాన ఐటిఐ జంక్షన్‌లో ఎన్‌టిఆర్‌ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సనపల వరప్రసాద్‌, పొలమరశెట్టి శ్రీనివాసరావు, లోడగల కృష్ణ, గార్లే అప్పారావు, ఎన్‌.అప్పారావు, వైవివి.ఆదినారాయణ, ఉప్పాడ శేఖర్‌, నాగలఅప్పలరాజు, జుట్టుకు శంకరరావు, పివి.రమణ, సుధ, పితాని రమణ, దాడి సోమేష్‌, చంటి, పరశురాంరెడ్డి పాల్గొన్నారు.