Oct 03,2022 00:06

రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న కోరాడ రాజబాబు

ప్రజాశక్తి అనందపురం : ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ ఆదివారం ఆనందపురం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేరు మార్పునకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, అనుబంధ సంఘాల నాయకులు గంట నూకరాజు, కసిరెడ్డి దామోదరరావు, బొద్దపు శ్రీనివాస, మీసాల సత్యనారాయణ, తాట్రాజి అప్పారావు, కురిమిన లీలావతి, గొల్లంగి ఆనందబాబు, దాసరి శ్రీనివాసరావు, గండ్రెడ్డి రమేష్‌, వానపల్లి ఈశ్వరరావు, బలిరెడ్డి మల్లికార్జునరావు, బోయి రమాదేవి తదితరులు పాల్గొన్నారు