ప్రజాశక్తి-పెదబయలు:ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం సరికాదని టిడిపి అరకు నియోజకవర్గం ఇంచార్జి, మాజీ మంత్రి కిడారి శ్రవన్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ముందుగా ఎన్టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నిరాహారదీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం గిరిజన అభివృద్ధిని గాలికి వదలి అరాచక పరిపాలన సాగిస్తుందన్నారు. ఎన్టిఆర్ పేరు మార్పు అనైతికమన్నారు. వైసిపి హయాంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు చేయాలన్నారు.కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీ కరించాలన్నారు. విద్యార్థులకు యూనిపాం ఇచ్చి కుట్టుకునేందుకు ఖర్చులు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వి కొండయ్య, దారేలా సర్పంచ్ పాంగి పాండు రంగ స్వామి, అరకు రైతు సంఘం అధ్యక్షులు కూడా భూషణం, అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వర్రావు, నాయకులు పాల్గొన్నారు.










