ప్రజాశక్తి- పిఎం పాలెం : హెల్త్ యూనివర్సిటీకి ఎన్‌టిఆర్ పేరును యథావిధిగా ఉంచాలని కోరుతూ 6వ వార్డు టిటిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యాన క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద శనివారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త కోరాడ రాజబాబు హాజరై ఎన్‌టిఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆనంతరం సంతాకాల సేకరణ చేసి రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, సంతాకాలను సేకరించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ, నాయకులు దాసరి శ్రీనివాస్, గొల్లంగి అనందబాబు, పిళ్లా వెంకటరావు, కానూరు అచ్యుతరావు, నాగోతి సత్యనారాయణ, చెట్టుపల్లి గోపి, మొల్లి లక్ష్మణరావు, వాండ్రాసి అప్పలరాజు, గరే గురునాధ్, నమ్మి శ్రీను, నాగోతి సూర్యప్రకాష్, సోముపాత్రుడు, రెడ్డి సత్యనారాయణ, పిల్ల రాము, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ : ఎన్‌టిఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద టిడిపి చేపట్టిన దీక్షలు రెండవ రోజైన శనివారం కొనసాగాయి. దీక్షల్లో 31, 32, 33 వార్డుల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జి మాట్లాడుతూ, ఎన్‌టిఆర్ పేరును తిరిగి కొనసాగించే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. రూ.వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారంలో వైసిపి ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీక్షలో పార్టీ 31వ వార్డు అధ్యక్షుడు సరిపల్లి మహేష్, 32వ వార్డు అధ్యక్షుడు దాసరి దుర్గారెడ్డి, దాసరి సత్యనారాయణ, మహిళా అధ్యక్షులు పంపాన రాజేశ్వరి, 33వ వార్డు ఇన్‌ఛార్జి విల్లూరి డాక్టర్ చక్రవర్తి, బంటుపల్లి సూర్యనారాయణ, 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చా రామురెడ్డి, 34వ వార్డు మహిళా అధ్యక్షులు పుక్కల రాజేశ్వరి పాల్గొన్నారు.










