Aug 06,2023 23:26

స్థలాల పరిశీలనలో యరపతినేని శ్రీనివాసరావు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఎన్‌టిఆర్‌, చంద్రబాబు బహిరంగ సభల్లో మాట్లాడిన ప్రదేశంలోనే నారా లోకేష్‌ బహిరంగ సభనూ నిర్వహిస్తామని గురజాల మాజీ ఎమ్మెల్యే యారపతినేని శ్రీనివాసరావు అన్నారు. యువగళం పాదయాత్రతో టిడిపి శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటుందని చెప్పారు. లోకేష్‌ పర్యలన నేపథ్యంలో మండలంలోని జానపాడు, జూలకల్లు, పిడుగురాళ్ల పట్టణ ప్రాంతంలో స్థలాలను ఆయన ఆదివారం పరిశీలించారు. సభ వద్ద ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పాదయాత్ర విజయవంతానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నాయకులను కమిటీలుగా ఏర్పాటు చేయాలన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో జానపాడు రోడ్డు వద్దగల కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలంలో 50 వేల మందితో సభా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ఎన్‌టిఆర్‌, చంద్రబాబు నాయుడు అదే గ్రౌండ్‌ నందు సభ ఏర్పాటు చేశారని, నేడు లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తూ వస్తున్న సందర్భంగా అక్కడే సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పిడుగురాళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా యువగళం కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. సోమవారం సాయంత్రం పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు లోకేష్‌ చేరుకుంటారని, రాత్రి బస అనంతరం మంగళవారం ఉదయం పాదయాత్ర మొదలవుతుందని, పిడుగురాళ్లలో సాయంత్రం సభ ఉంటుందని వివరించారు. సభ అనంతరం పట్టణ శివారు ప్రాంతంలోని వలల గార్డెన్స్‌లో రాత్రి బస ఉంటుందన్నారు. పాదయాత్ర, బహిరంగ సభకు గురజాల నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా తరలిరావాలని కోరారు.