ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని, ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం బాపట్ల సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఇంతవరకు పాత్రికేయులు సమావేశం నిర్వహించలేదని అన్నారు. పార్టీ నాయకుడు పేర్ని నాని మీడియా సమావేశాల్లో మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. 87 శాతం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఏకమైనా మమ్ములను ఏమి చేయలేవని మాట్లాడుతున్నారన్నారు. 87 శాతం మంది ప్రజలకు అండగా ఉంటే ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును 175 సీట్లు పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ 175 సీట్లలో పోటీ చేయాలని పదేపదే పాట పాడటం ఎందుకన్నారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రులు మాకు ఓటు వేస్తే రాజధాని విశాఖపట్నం ఉగాది నాటికి సీఎం ఇక్కడే కుర్చుంటారని ప్రచారం చేసినా ఉత్తరాది ఓటర్లు తిరస్కరించి చిత్తుచిత్తుగా ఓడిరచారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే నీ పీడ ముందుగానే రాష్ట్రానికి వీడిపోతుందన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశావో చెప్పాలని రామకృష్ణ సీఎం జగన్‌కు చాలెంజ్ చేశారు. వ్యవసాయ రంగం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగం, ఐటీ సెక్టారులో ఎక్కడ్కెన ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన చేశావా? మీడియా సాక్షిగా వెళుదమా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు చెప్పిన వాగ్ధానాలు ఏమి సక్రమంగా అమ లు చేశావో చెప్పాలన్నారు. మద్యపాన నిషేదం దశలవారీగా అని అధికారంలో వచ్చిన తరువాత మద్యపానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందా పెరిగిందా సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జంగాల అజరుకుమార్, జిల్లా కార్యదర్శి తన్నీ రు సింగరకొండ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి నాగాంజ నేయులు, జిల్లా నాయకులు జేబీ శ్రీధర్ పాల్గొన్నారు.










