ప్రజాశక్తి -హుకుంపేట:2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని అల్లూరి జిల్లా ఎస్‌టీ సెల్ అధికార ప్రతినిధి పట్టిబోయిన శంకర్ నాయుడు పిలుపునిచ్చినిచ్చారు. మండలంలో కేంద్ర లోని శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు లబోదిబో మంటున్నారన్నారు.. పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతునాయన్నారు.2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో వచ్చే విధంగా అరకు అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముల్యపుట్టు వైస్ సర్పంచ్ మత్యారాజు, జరకోండ మాజీ వైస్ సర్పంచ్ మదేల చినయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి కైలాష్, నైని రమేష్, రెగం తిరుపతి, రేగం పద్మారావు, మజ్జి మూర్తి, సిరగం అప్పన్న, సిరగం రాజారావు తదితరులు పాల్గొన్నారు.










