కురుపాం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ తోయక జగదీశ్వరి అన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఓటర్ల తనిఖీ కార్యక్రమానికి ప్రతి బూత్ ఇన్చార్జిలు, బిఎల్‌ఒలుగా అను సరించి హౌస్ మ్యాపింగ్ చేయాలన్నారు. సమావేశంలో టిడిపి మండల కన్వీనర్ కెవి కొండయ్య, పోల్‌మేనేజ్మెంట్ పోలూరు శ్రీనివాసరావు, మన టిడిపి యాప ్‌ట్రైనర్ సుకేష్ చంద్రపండా, బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.
వీరఘట్టం : ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం సిద్ధంగా ఉండాలని టిడిపి పాలకొండ నియోజకవర్గం బాధ్యులు నిమ్మక జయకృష్ణ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేట్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, నాయకులు పొన్నాడ నాగేశ్వరరావు, జామి లక్ష్మీనారాయణ, పారిచర్ల వెంకటరమణ, మాచర్ల అనిల్, బల్ల హరి, లింగాల చంటి, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు ఏజెంట్లు, కార్యకర్తలు, పాల్గొన్నారు.










