Oct 05,2023 21:19

సభలో మాట్లాడుతున్న విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-గరివిడి : కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం చీపురుపల్లి నియోజకవర్గం వైసిపి నాయకులు, కార్యకర్తల సమావేశం గరివిడి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతివ్యక్తి ఆరోగ్య సమస్యలూ తెలుసుకొని పరిష్కరించే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏ అభివద్ధి కార్యక్రమాలు చేపట్టిందో వివరించాలన్నారు. ఈ ఆరు నెలలూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. జెడ్‌పి చైర్మన్‌ మాట్లాడుతూ టిడిపికి మీడియా అండగా ఉన్నా, జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. పార్టీ విజయం కోసం ప్రతీ ఒక్క నాయకుడు కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం చేసేవిధంగా కృషి చేయాలని సూచించారు. ఎమ్‌పి బెల్లాన చందశ్రేఖర్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల అబద్దపు మాటలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.