ప్రజాశక్తి - పాలకోడేరు
రానున్న రోజుల్లో ఎన్నికలే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు) అన్నారు. మండలంలోని వేండ్ర గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఎంపిపి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును ఎంపిపి ఆవిష్కరించి వైసిపి జెండాను ఎగరవేశారు. అనంతరం గ్రామ సర్పంచి కడలి నాగేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపిపి చంటిరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, బొల్లా శ్రీనివాస్, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ నాగేంద్రకుమార్, పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి పోలయ్య, ఎంపిటిసి సభ్యులు పాల జ్యోతి, సోడదాసి నరేష్, ఆదాడ లక్ష్మీతులసి, కాటూరి శాంతకుమారి, సర్పంచులు జంగం సూరిబాబు, చింతపల్లి చిన్న పాల్గొన్నారు.
పెనుమంట్ర :పెనుమంట్ర-2 సచివాలయంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ అధ్యక్షుడు తేతలి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి తాడిపర్తి ప్రియాంక మాట్లాడారు.
ఆచంట:కొడమంచి లి రైతు కమ్యూనిటీ హాలులో సచివాలయం-1 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ మాట్లాడుతూ సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాల వారికి వైసిపి సమన్యాయం చేస్తుందన్నారు.
పోడూరు : మండలంలోని కవిటం సచివాలయం-1 పరిధిలో గ్రామ సర్పంచి చుట్టుగుళ్ల పూర్ణిమ అధ్యక్షతన రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎంపిపి సుమంగళి సాగర్, సర్పంచి పూర్ణిమ, సొసైటీ ఛైర్మన్ కర్రి శ్రీనివాసరెడ్డి వైసిపి జెండా ఆవిష్కరించారు.
ఉండి : మండలంలోని కలిసిపూడిలో సర్పంచి జానకిశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరినారాయణరాజు మాట్లాడారు.