
ప్రజాశక్తి - బిక్కవోలు విజయదశమి సందర్భంగా మండలంలోని తొస్సుపూడి గ్రామం నుంచి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్‌ఎ నల్లమిల్లి మూలారెడ్డి నాయకత్వంలో ఏ కార్యక్రమం తలపెట్టిన విజయదశమి రోజున తొస్సుపూడి నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని, అందుకే ఎన్నికలకు సమాయత్తం కావాలని నారా లోకేష్ పిలుపుమేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టిడిపి కార్యకర్తలను పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు అరెస్టు చేశారని విమర్శించారు. టిడిపికి ఓటు వేయవలసిన అవశ్యకతను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తావని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.