Sep 02,2023 21:59

మాట్లాడుతున్ననాయకులు

మాట్లాడుతున్ననాయకులు
ఎన్నికైన నూతన కమిటీ
జెవివి పట్టణ మహా సభప్రజాశక్తి-కావలి: కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక మహాసభ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, పి.జానకిరామ్‌ల అధ్యక్షతన శుక్రవారం స్థానిక రవి నర్సింగ్‌ హోంలో ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ కమిటీలో గౌరవాధ్యక్షులుగా డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, అధ్యక్షులు తోటవెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి హరినాథ్‌, కోశాధికారి టంగు టూరి సుబ్బరామశర్మలతో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పాపిశెట్టి జానకిరామ్‌, కందికట్టు నారాయణ, శ్రీకర్లవెంకయ్య, షేక్‌.ఖాదర్‌భాష, కే.హరినారపరెడ్డి, కల్లయ్య, సహాయ కార్యద ర్శులు ఎన్నికయ్యారు
. ఎంపికైన నూతన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞచేశారు.గ తంలో పట్టణ ఉపాధ్యక్షులుగా ఉన్న ఆకుల రమణయ్య ఈ సందర్బంగా రిలీవ్‌ అయ్యారు. మహా సభ జయప్రదానికి సహకరించిన సభ్యులందరికి అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.