
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి భయపెట్టి పాలనా చేయాలని చూస్తున్నారని, మాజీమంత్రి పేర్ని నాని నాపై పోలీస్‌లతో కుట్రలు చేస్తున్నాడని, తప్పు చేయని తాను దేనికీ భయపడనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం స్థానిక నియోజక పార్టీ కార్యాల యంలో తెదేపా నాయకులతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ స్థానికంగా శాసన సభ్యులు పేర్ని నాని పోలీస్‌లను అడ్డు పెట్టుకుని కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం రోజు తాను బీసీ సంఘాలతో కలసి నారా భువనేశ్వరి సంఘీభావం కోసం రాజమండ్రికి వెళ్తానని కక్షకట్టి అక్రమ నిర్బంధం చేసారన్నారు. తనను ఒక నక్సలైట్, టెర్రరిస్ట్‌లా ఇబ్బందులు పెడుతూ చల్లపల్లి, అవనిగడ్డ, కత్రివెన్ను, పెడన, ఇలా ఒక చోటికి కాదు అనేక స్టేషన్స్ తిప్పి మాన సికంగా ఇబ్బందిపెట్టి నా అత్తస్థైర్యన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారన్నారు. పేర్ని నాని, పోలీస్‌లు తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వారి అవినీతి అక్రమాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తునే ఉంటానన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.