May 12,2023 23:59

మావోయిస్టు మృతదేహం

ప్రజాశక్తి -చింతూరు
చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లా, కేర్లపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి సిరిసిట్టి అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలించగా భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్లు, వాకీటాకీలు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.