Jul 30,2022 00:01

ఎన్‌ఎస్‌టిఎల్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తున్న డాక్టర్‌ పూజ

ప్రజాశక్తి- కరాస: నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబరేటరీ (ఎన్‌ఎస్‌టిఎల్‌)లో గోపాలపట్నం
పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ బి.పూజ పర్యవేక్షణలో కరోనా వ్యాక్సినేషన్‌ బూస్టర్‌ డోస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ శుక్రవారం నిర్వహించారు. ఎన్‌ఎసల్‌టిఎల్‌ డైైరెక్టర్‌ వై శ్రీనివాసరావు ప్రారంభించిన శిబిరంలో 167 మంది సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేశారు. 30 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో సైంటిస్ట్‌ అండ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ జివి కృష్ణకుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎస్‌.రమేష్‌బాబు, బి బాలజవహార్‌, సంస్థ సిఇ యూనియన్‌ ప్రెసిడెంట్‌ సి హెచ్‌విఎస్‌ఎన్‌ మూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, హేమంత్‌ బయాస్‌, సిహెచ్‌వి.రమణ పాల్గొన్నారు.