ప్రజాశక్తి- కరాస : విశాఖపట్నంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన,్ నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబరేటరీలో శుక్రవారం ఉచిత దంత వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్ వై శ్రీనివాసరావు ప్రారంభించిన దంత వైద్య శిబిరంలో ది స్మైల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ వై.రాజేష్‌కుమార్, డాక్టర్ శ్రవణ్‌కుమార్, ఇతర వైద్యబృందం పాల్గొని రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. దంత సంరక్షణపై తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో వర్స్ కమిటీ సభ్యులు చైర్మన్ డాక్టర్ మను కోరిల్ల, సత్యవాణి, సిహెచ్ జయరావు, జి నాగభూషణం, ఎస్‌కె.సాహు, సిహెచ్ చంద్రశేఖరరావు, అనిల్ కుమార్, జనకరాజ్, సీనియర్ శాస్త్రవేత్తలు పివిఎస్ గణేష్ కుమార్, సిహెచ్ విఎస్‌ఎన్ మూర్తి, మూర్తి కృష్ణకుమార్, డాక్టర్ జివి కష్ణకుమార్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.










