Aug 12,2022 00:35

వారోత్సవాల్లో పాల్గొన్న ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్లు

ప్రజాశక్తి- కరాస: నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ ఎన్‌ఎస్‌టిఎల్‌ లో స్వాతంత్య్రదినం వారోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌, వాలీ బాల్‌, ప్లాంటేషన్‌, ఫ్రీడమ్‌ వాక్‌, ఇన్విటేషన్‌ క్రికెట్‌ మ్యాచ్‌, ఆజాది కల్చరల్‌ ఫెస్ట్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్‌ఎస్‌టిఎల్‌ కాంప్లెక్స్‌లోని పిచ్చయ్య ఇండోర్‌ స్టేడియంలో టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌తో వారం రోజుల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఎన్‌ఎస్‌టిఎల్‌, జివిఎంసి, బిడిఎల్‌, విశాఖపట్నం డాక్టర్స్‌ అసోసియేషన్‌ జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రీడలను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పివిఎస్‌ గణేష్‌ కుమార్‌, డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌కుమార్‌, డాక్టర్‌ మనుకోరులా, సివిల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌విఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు.