
చెత్తా చెదారం తొలగిస్తున్న వాలంటీర్లు
ప్రజాశక్తి -పాయకరావుపేట: మండలంలోని సీతారాంపురం గ్రామంలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసేస్ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో సీతారామపురం గ్రామంలో ఆదివారం స్వచ్చభారత్‌ను చేపట్టారు. ఇ ందులో భాగంగా గ్రామాన్ని శుభ్రపరిచారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. వివిధ వ్యాధుల వ్యాప్తి, లక్షణాలు పట్ల ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ర్యాలీ చేపట్టారు. వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సర్పంచ్ పీ.వెంకటకృష్ణ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీ.టీ.నాయుడు, భాస్కర్ రావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.