Nov 06,2022 23:33

 మాట్లాడుతున్న అమ్మోరయ్య

ప్రజాశక్తి -నక్కపల్లి : ఎన్‌ఎఒబి నిర్వాసిత మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని మత్స్యకార జెఎసి రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మోరియ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం రాంబిల్లి మండలం ఎన్‌ఎఒబి మెయిన్‌ గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న నిర్వాసిత మత్స్యకారులను కలిసి, వారికి జెఎసి తరపు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకారుల సమస్యల పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం దారుణమని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మత్స్యకార జెఎసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేరుగు కొర్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిక్కి కోదండరావు, రాష్ట్ర కార్యదర్శి వాసుపల్లి నూకరాజు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి చెల్లూరి మల్లికార్జున, మైలపల్లి శ్రీనివాస్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పిక్కిస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల శ్రీనివాసరావు, రాంబిల్లి మండల అధ్యక్షులు చింతకాయల దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు .