ప్రజాశక్తి-యంత్రాంగం :
భీమునిపట్నం : చిట్టివలస ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన ఉచిత శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు అర్హత పొందినట్లు సంస్థ వ్యవస్థాపకులు గంటాన మోహనరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దత్తి ఈశ్వర రావు, రేఖ అప్పారావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు రూ.12 వేలు చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని వివరించారు. తమ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ పొందిన చిట్టి వలస జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జె.కీర్తన, ఎన్.షణ్ముఖ, కె.హరికోమల, కె.రఘువర్మ, ఎం.లోహిత్ కుమార్, కె.రితీష్ ఎంపికైన వారిలో ఉన్నారని పేర్కొన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ హైస్కూల్‌కు చెందిన ఎసాయి వర్ధన్, ఎ.ఈశ్వరి, భీమిలి సెయింట్ ఆన్స్ హైస్కూల్‌కు చెందిన ఎం.భవ్య, భీమిలి మండలం, తాళ్ళవలస జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఆర్.జోషిత, వై.దీక్షిత, జివిఎంసి హైస్కూల్‌కు చెందిన సిహెచ్.సాయికృష్ణ, పద్మనాభం మండలం రేవిడి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎం.జ్యోష్న, వెంకటాపురం ఎంపియుపి పాఠశాలకు చెందిన ఎం.విశాలాక్షి ఎంపికైన వారిలో ఉన్నారని తెలిపారు.
ఎంపికైన గిరిజన విద్యార్థినులు
స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చెందిన గిరిజన విద్యార్థినులు జె.స్నేహిత, పి సంజన ఎంపికైనట్లు హెచ్ ఎం రామేశ్వరి, ఉపాధ్యాయులు ఆనంద్ తెలిపారు. ఇద్దరు విద్యార్థినులను శనిారం పాఠశాలలో అభినందించారు.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పి.లావణ్య ఎంపికైనట్లు హెచ్‌ఎం ఎం.శివరాణి తెలిపారు.
తోటగరువు విద్యార్థులు అర్హత
ఆరిలోవ : తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు ఇ.అఖిలేష్, కె.శ్రావ్య అర్హత సాధించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని తెలిపారు.
వడ్డాది : ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలలో వడ్డాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పి వేద విద్య, బి ఈశ్వరప్రసాద్ ఉత్తీర్ణత సాధించి ఎన్‌ఎంఎంఎస్ స్కారల్ షిప్‌కు ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నుండి సంవత్సరానికి రూ.12000 చెప్పిన నాలుగు సంవత్సరాల పాటు మొత్తం రూ.48000 స్కాలర్ షిప్ అందించబడుతుందని పాఠశాల హెచ్‌ఎం పీవీ శేషుబాబు తెలిపారు.
సబ్బవరం : ఎన్‌ఎంఎంస్ పరీక్షలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు నక్క సత్యప్రసాద్ (107), మారడబూడి టీన్స్ ప్రియ(102), కోతల చరిష్మా (99), నక్క సాలోమి ఫ్లోరెన్స్ (89), గంపరాయి కీర్తి (75) ఎంపికైనట్లు ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సీహెచ్. చిన్నమ్మాయి తెలిపారు. వీరిని మండల విద్యా శాఖాధికారి యస్.అప్పలరాజు,ఉపాధ్యాయులు అభినందించారు.
నక్కపల్లి:మండలంలోని డిఎల్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్‌కు ఎంపికైనట్లు హెచ్‌ఎం వేమగిరి నూకరాజు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏడిద నాగచైతన్య, సొవ్వేటి స్వామిలు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్‌కు అర్హత సాధించారని అన్నారు. ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
ప్రజాశక్తి-అచ్చుతాపురం : మార్టూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఈరిగుల సంజన 2022-23 సంవత్సరానికి ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఫలితాలలో ఎంపికైట్లు హెచ్‌ఎం కె.మురళీకృష్ణ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ కొత్తలి నూకరాజు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.మురళీకష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మెరిట్ స్కాలర్షిప్ అందిస్తుందని తెలిపారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12000ల చొప్పున రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం నేరుగా తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వినియోగించు కోవాలని కోరారు. ఎంపికైన విద్యార్థిని ఉపాధ్యాయులు మాత సూర్యలక్ష్మి, శాంతి, సుబ్రహ్మణ్యం, ఎలీషా అభినం దించారు.










