పరిశీలిస్తున్న డిఇఒ, చీఫ్ సూపరిండెండెంట్
ప్రజాశక్తి-పాడేరుటౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ బాలుర పాఠశాలలో జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 244 మంది విద్యార్థులకు గాను 186 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. డిపార్ట్ మెంట్ అధికారిగా పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.కృష్ణమూర్తి, చీఫ్ సూపరిండెంట్‌గా తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ బాలుర పాఠశాల హెచ్‌ఎం రీమలి జాన్ వ్యవహరించారు. పరీక్షా కేంద్రాన్ని డిఇఒ పి.రమేష్ పర్యవేక్షించారు.










