
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని పెసర్లంక డీకే జెడ్‌పి ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్ ప్రదీప్ కుమార్ వివిధ అంశాలను ప్రయోగాత్మకంగా వివరించారు. విజయవాడ 10వ బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వరదలు, విపత్తులు, అగ్నిప్రమాదం వంటి సంఘటనలు జరిగిన సమయంలో ప్రజలు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలో వివరంగా చేసి చూపించారు. ఈ విధానం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఏదో సమయంలో కృష్ణా నదికి వరదల సంభవిస్తూ ఉంటాయని అన్నారు. దాని దృష్ట్యా ఎన్డిఆర్ఎఫ్ సూచనలు, సలహాలు పాటించాలని అన్నారు. పెసర్లంక, పెదలంక, చింతమోటు తదితర గ్రామాల నుండి ప్రజలు, మహిళలు తిలకించారు. పాఠశాల విద్యార్థులతో కొన్ని రకాల ఆపత్కాల నివారణ అంశాలను చేయించారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఉదయ భాస్కరి, ఎంపీపీ లలిత కుమారి, సర్పంచులు వేములపల్లి వెంకటేశ్వరరావు, గుమ్మడి శంకర్రావు, వేములపల్లి రంజిత, ఎంపీటీసీ నన్నేపాముల చంటి, తహశీల్దారు డి వెంకటేశ్వరరావు, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్, వీఆర్‌ఒ మండ్రు జకరయ్య, కార్యదర్శి పుష్పలత పాల్గొన్నారు.